1. ప్రేమ

దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మరియు మీ కోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు.

బైబిల్ ఏమి చేప్తుందంటే, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” (యోహాను 3:16).

“వారికి జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని” యేసు అనెను — ఒక పూర్తి జీవిత కాల ప్రయోజనం (యోహాను 10:10).

2. వేరుబడ్డారు

మనం పాపులం మరియు దేవుడి నుండి వేరుచేయబడ్డాం.

మనం అంతా చెడు పనులు చేశాం, ఆలోచించాం లేదా చెప్పాము, వాటిని బైబిల్ “పాపాలు” అని పిలుస్తుంది. బైబిల్ ఇలా చెప్తోంది, “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” (రోమీయులకు 3:23).

పాపము వలన వచ్చు జీతము మరణము, ఆత్మీయ ఎడబాటు (రోమీయులకు 6:23).

3. యేసు

మీ పాపాల కోసం మరణించటానికి దేవుడు యేసుని పంపినాడు.

ఇది మంచి వార్త:

యేసు మన ప్రదేశంలో చనిపోయాడు, కనుక దేవునితో మనం సంబంధం కలిగి ఉండవచ్చు మరియు ఆయనతో శాశ్వతంగా ఉండవచ్చు.

“అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను” (రోమీయులకు 5:8).

కానీ సిలువపై ఆయన మరణంతో అది పూర్తి కాలేదు. ఆయన మరలా లేచాడు మరియు ఇంకా జీవించి ఉన్నాడు!

“లేఖనముల ప్రకారము యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను … సమాధి చేయబడెను … ప్రకారము మూడవ దినమున లేపబడెను” (1 కొరింథీయులకు 15:3-4).

యేసు ఒక్కడే దేవునికి ఏకైక అనుసంధానం.

యేసు అనెను, “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” (యోహాను 14:6).

4. ప్రార్థించండి

క్షమాపణ స్వీకరించాలని దేవుడిని ప్రార్థించండి.

ప్రార్థించటం అంటే దేవునితో మాట్లాడటమే. మీరు ఆయనకు తెలుసు. మీ హృదయ వైఖరి మరియు మీ నిజాయితీయే ముఖ్యం. యేసు మీ రక్షకుడుగా స్వీకరించటానికి ఇలా ప్రార్థించండి:

 

“యేసు క్రీస్తూ,
నా జీవితంలో నేను తప్పుగా చేసిన పనులకు నన్ను క్షమించు.  నా కోసం సిలువపై మరణించినందుకు నీకు ధన్యవాదాలు, నా పాపాలన్నిటి నుండి నన్ను విముక్తుని చేయి మరియు నేడే నన్ను క్షమించుత.  దయచేసి నా జీవితంలోకి రండి మరియు మీ పరిశుద్ధ ఆత్మను నాలో నింపండి. ఎప్పటికీ నాతోనే ఉండండి.

యేసు నీకు కృతజ్ఞతలు!”

మీరు ప్రార్థించారా?

యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోండి.

100% ప్రైవేట్.

  • This field is for validation purposes and should be left unchanged.

ఉచిత బైబిల్

 

అనువర్తన డౌన్‌లోడ్

చాట్

ఒక క్రైస్తవుడితో చాట్ చేయండి